13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బడ్జెట్‌లో బీసీలకు న్యాయం ఎక్కడ?

23-03-2026 01:09 AM
  1. రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపు
  2. తెలంగాణ రాజ్యాధికార పార్టీ

హైదరాబాద్, మార్చి 22(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ్ర పభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆ ర్పీ) తీవ్రంగా విమర్శించింది. బడ్జెట్‌లో బీసీలకు సరైన కేటాయింపులు చేయకపోవడమే కాకుండా, కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను పూర్తిగా వి స్మరించిందని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసిం ది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి ఏటా రూ.20 వేలకోట్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఈసారి కేవలం రూ.12వేల కోట్లకే పరిమితం చేయడం దారుణమన్నారు.

బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించింది. రాష్ట్రంలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జె ట్లో కేవలం 6శాతం నిధులు మాత్రమే కేటాయించారని 10శాతం కూడా లేని ఓసీ మంత్రుల చేతిలో 62 శాతం బడ్జెట్ ఉందని ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంద ని ప్ర భుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ అన్యాయాలపై నిరసనగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించిం ది. ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ భారీసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇవ్వాలని పార్టీ పిలుపునిచ్చింది.