calender_icon.png 8 August, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

17-12-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16(విజయక్రాంతి) : జలమండలి ఆధ్వర్యంలో చేపట్టే పనుల్లో నాణ్యతను పెంచేందు కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించింది. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, జలమండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మా ట్లాడుతూ.. జలమండలి పనుల కోసం ప్రొక్యూర్ చేసే యంత్రా లు, ఎలక్ట్రికల్ సామగ్రి, పైపులు, మ్యాన్‌హోళ్లు, వాల్వ్‌లు, ఇతర పరికరాలు ఐఎస్‌ఐ ప్రమాణాల మేరకు ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించా రు. అనంతరం జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ 90రోజుల ప్రత్యేక ప్రణాళికపై అధి కారులతో సమీక్షించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. బాగా పనిచేసిన సెక్షన్ల మేనేజర్లను అభినందించారు.