15-10-2025 12:13:45 AM
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణం లో అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణం వివిధ వార్డులలో టి యు ఎఫ్ ఐ డి సి, జనరల్ ఫండ్ తో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులు వర్షాల వల్ల నిలిచిపోయాయని, ఆ పనులు రేపటి నుండి యదావిధిగా ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రజలకు అత్యవసరం ఉన్న చోట పనులు త్వరిత గతిన ప్రారంభించాలన్నారు. పలు సమస్యలు, కారణాలతో నిలిచిపోయిన కొన్ని పనులు వేరే వార్డులకు, ఇతర ప్రాంతాలకు మార్చాలన్నారు. నాణ్యతతో పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, పూర్తి అయిన పనులకు త్వరిత గతిన బిల్లులు చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, ౄE లు ఆనంద్, వరుణ్ ఏయి లు శరన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.