calender_icon.png 18 October, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలు సురక్షితంగా విద్యావంతులుగా ఎదగాలి

15-10-2025 12:12:15 AM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పుష్పలత

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : బాలికలు సురక్షితంగా, విద్యావంతులుగా స్వయం సమర్థులుగా ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్ పర్సన్ జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు.బి. పుష్పలత  అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కుసుమరామయ్య జడ్పీహెచ్‌ఎస్ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం. కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, చైర్ పర్సన్ జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు.

బి. పుష్పలత ఎఫ్ ఎ సి. మాట్లాడుతూ. ప్రతి బాలికా గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉందని తెలిపారు. చట్టాలపై ప్రతి మహిళ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన మరియు చిత్రలేఖనం పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ .ఈ బహుమతులు జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క  స్పాన్సర్ చేయబడి తీసుకోబడ్డాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఎస్‌ఐ వినీత రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ మోతిలాల్, ఎ.వేణు న్యాయవాది, జి.ఆంజనేయులు న్యాయవాది .సిహెచ్.భాస్కర్, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు.