13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

వ్యవసాయ వర్సిటీలో ప్రశ్న పత్రాల లీకేజీ

09-01-2026 01:13 AM

విచారణకు ఆదేశం.. నలుగురి సస్పెన్షన్

సుమారు 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థుల డిస్మిస్

రాజేంద్రనగర్ జనవరి 8 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో మూడవ సంవత్సరం బీ ఎస్సీ(అగ్రికల్చర్) కోర్సు చదువుతున్న సుమారు  35 మంది ఇన్ స ర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వా రిని తిరిగి వ్యవసాయ శాఖ కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు  ఉప కులపతి ప్రొఫె సర్ అల్డాస్ జానయ్య తెలిపారు.  ఇతర అధికారులతో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాలను అయన గురువారం సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకు అవుతున్నట్లు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్ర విచారణ చేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు.

ఈ కమిటీ అన్ని కో ణాల నుంచి విచారణ నిర్వహిస్తుందన్నారు.  వ్యవసాయ శాఖ లో ఏ ఈ ఓ లు గా పని చేస్తూ వ్యవసాయ వర్సిటీలో ఇన్ సర్వీస్ కోటాలో 3 వ ఏడాది బీ ఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారం తో లీకు చేసి వాట్సాప్ గ్రూప్ లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకి పంపుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు లు చేతులు మారాయని తేల్చారు. ఒక పథకం ప్రకారం కొన్నేళ్లు గా  ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సి టీ ఈ అంశాన్ని చాలా తీవ్రం గా పరిగణి స్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

ప్రక్షాళనే తదుపరి కర్తవ్యం..

2014 నుంచి 2024 వరకూ పూర్తి స్థాయిలో విశ్వ విద్యాలయం లో ఉన్నత అధికారులు లేకపోవడంతో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటనీ ఉప కులపతి అల్డాస్ జానయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ప్రక్షాళన మొదలు పెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని వివరించారు. అవసరం అయితే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయాలని కోరతామన్నారు.  భవిష్యత్ లో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.