సికింద్రాబాద్‌లో సిక్కుల విశాల్ కీర్తన్ దర్బార్
09-12-2024 01:02 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): సికింద్రాబాద్ చిలకలగూడ సీతాఫల్‌మండి మున్సిపల్ పార్క్ లో గురుద్వారా గురుసింగ్ సభ, ప్రభందక్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సిక్కుల విశాల్ కీర్తన్ దర్బార్ (సామూహిక సమ్మేళనం) ఘనంగా జరిగింది.
సిక్కుల 9వ గురువు తేజ్ బహదూర్ సాహిబ్‌జీ బలిదానానికి ప్రతీకగా నిర్వహించిన ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి సిక్కులు భారీగా తరలొచ్చారు. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని పఠించారు. కార్యక్రమంలో ప్రభందక్ కమిటీ అధ్యక్షుడు ప్రతాప్‌సింగ్ ఒసాహన్, సెక్రటరీ రంజిత్, వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన సిక్కులు పాల్గొన్నారు.






