10-05-2025 12:00:41 AM
భూత్పూర్, మే 9 : ఆర్టిఐ యాక్టివిటీస్ ఫోరం భూ త్పూర్ మండల అధ్యక్షుడిగా ఆర్. భూపతిరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ ఫోరం జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్ ఆధ్వర్యంలో నియామక ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనం గా నియమితులైన ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులను సమన్వ యం చేసుకుంటూ జిల్లాలో సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలకు కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఆర్టిఐ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతానని, సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సహ చ ట్టం విషయంలో ప్రజలకు అందుబాటులో ఉంటాన ని అన్నారు. సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారితనం సాధ్యమన్నారు. తన పైన ఉన్న నమ్మకంతో తనకు బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.