calender_icon.png 2 August, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐర్లాండ్‌లో జాత్యహంకారం

01-08-2025 12:00:00 AM

భారత సంతతి వ్యక్తిపై అమానుష దాడి

డబ్లిన్, జూలై 31: భారత సంతతికి చెందిన 32 సంవత్సరాల సం తోష్ యాదవ్ అనే వ్యక్తిపై డబ్లిన్‌లోని అతని అపార్ట్‌మెంట్ సమీపం లో ఓ గ్యాంగ్ దాడి చేసి గాయపర్చింది. ఆరుగురు టీనేజర్స్ సంతో ష్‌యాదవ్‌పై జాత్యహంకార వ్యాఖ్య లు చేస్తూ పిడిగుద్దులు కురిపించా రు. ఈ దాడిలో సంతోష్ యాదవ్ ముఖంపై తీవ్రంగా గాయాలయ్యా యి. సంతోష్ యాదవ్ 2021 నుం చి ఐర్లాండ్‌లో నివాసం ఉంటున్నా డు.

దాడికి గురైన సంతోష్ యాదవ్ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు. డబ్లిన్‌లో గత కొద్ది రోజులుగా భారతీయులపై జాత్యహంకార దా డులు పెరుగుతున్నాయి. ఆయనపై టీనేజర్లు దాడి చేసిన విజువల్స్ సో షల్ మీడియాలో వైరల్ అవుతున్నా రు. ఆ టీనేజర్లు సంతోష్ యాదవ్ గ్లాసెస్‌ను కూడా విరగ్గొట్టారు.