01-08-2025 12:00:00 AM
కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ, జూలై 31: రోహింగ్యాల విషయమై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోహింగ్యాలను శరణార్థులుగా ప్రకటించేందుకు అ ర్హులేనా? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. అసలు రోహింగ్యాలు చొర బాటుదారులో.. శరణార్థులో తేల్చాలని ఆదేశించింది. గురువారం న్యా యమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎన్.కో టీశ్వర్‌సింగ్‌లతో కూడిన బెంచ్ రో హింగ్యాల అంశంపై విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో ధర్మాసనం మాట్లాడుతూ.. ఒకవేళ రోహింగ్యాలు చొరబాటుదారులైతే బహి ష్కరిస్తున్నారా? అని కేంద్రాన్ని సూ టిగా ప్రశ్నించింది. అంతేకాదు రో హింగ్యాల బహిష్కరణకు కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న చర్యలేంటనేది కూడా చెప్పాలని న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది. వారిని నిరవధికంగా నిర్భంధించడం లేదా బెయిల్ పై విడుదల చేయవచ్చా అని ప్రశ్నించింది.
రోహింగ్యాల నిర్భందమే కీల క అంశమని పిటిషనర్ల తరఫు న్యా యవాది దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం రోహింగ్యా లకు సంబంధించి దాఖలైన అనేక పిటిషన్లను మూడు విభాగాలుగా విభజించి విచారణ చేపడతామని పే ర్కొంది. ప్రతి బుధవారం వీటిని వి చారించేందుకు సమయం కేటాయిస్తామని పేర్కొంది.