01-08-2025 12:00:00 AM
2,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
న్యూఢిల్లీ, జూలై 31: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చే యనున్నారు. పర్యటనలో భాగంగా హర్దత్‌పూర్ రైల్వే బ్రి డ్జిని ప్రారంభించనున్న మోదీ అనంతరం దల్మండి, కోట్వా, గంగాపూర్, బాబత్‌పూర్‌లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేయనున్నారు. దేశ వ్యా ప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 20,500 కోట్లు జమ కానుంది.