16-07-2025 12:56:12 AM
సామాజికవేత్త జోసెఫ్
ఖైరతాబాద్, జూలై 15 (విజయ క్రాంతి) : క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యాఖ్యలు చేసిన రాదా మనోహర్ దాసును తక్షణమే అరెస్టు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త జోసెఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏసుప్రభు, బైబిల్ గ్రంథం, తల్లి మరియమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిం చారు. దీనిపై నెలరోజుల క్రితం తమ ఫిర్యాదు మేరకు పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా, ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాదాకరమన్నారు.
మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం రేవంత్ రెడ్డి , ప్రధాని మోదీ సైతం క్రైస్తవ్యాన్ని గౌరవించారన్నారు. కానీ, రాధా మనోహర్ దాస్ మాతృమూర్తి అని చూడకుండా అగౌరవంగా మాట్లాడారన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ శ్యామ్, సరోజ బాస్కర్, అశోక్, రహీం తదితరులు పాల్గొన్నారు.