రోడ్‌షోను తలపించిన రాఘవ అరెస్టు
పార్టీ సభ్యుడే కాదు... అంత ప్రాముఖ్యత ఎందుకో ?
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సోమవారం టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్టు నీటి తరలింపు పై జరిగిన నిరసన కార్య క్రమం లో పార్టీ కార్యకర్తలను నాయకులను పోలీసులు అరెస్ట్ ఈ క్రమంలో వనమా రాఘవేందర్రావు అరెస్టు లో పోలీసు లు ఇచ్చిన ప్రాముఖ్యతపై సర్వ త్రా విమర్శలు వెలబడుతున్నాయి. రాఘవది అరెస్టా, రోడ్ షో నా అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు.
పాత పాల్వంచలోని ఓ కుటుంబం సజీవ దహనం సంఘటనలో బిఆర్‌ఎస్ పార్టీ వనమా రాఘవేందర్రావును పార్టీ నుంచి రాష్ట్ర కమిటీ సభ్యత్వంతో సహా సస్పెండ్ చేశారు. మూడు సంవత్సరాలైనా అతనిపై పార్టీ విధించిన సస్పెన్షన్ నేటికీ ఎత్తి వేయలేదు. తనకు తానే బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం గమనార్హం.
ఆయన వ్యవహారంపై జిల్లా, రాష్ట్ర పార్టీ కమిటీలు పల్లెతిమాట అనకపోవడం కోసమెరుపు. అంతేకాదు పోలీసులు అతని అరెస్ట్ చేసిన తీరు రోడ్ షో ను తలపించేలా ఉందని విమర్శలు వెలబడుతున్నాయి. సభ్యుడే కానీ వ్యక్తికి పోలీసులు ఇచ్చిన ప్రాముఖ్యతను పలువురు చర్చించుకుం టున్నారు. పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చనీయాంశమైంది.






