calender_icon.png 1 July, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఐ రాణాప్రతాప్ భార్య ఆత్మహత్య

01-07-2025 12:00:00 AM

- భర్త, అత్త మామల వేధింపులే కారణమంటున్న మృతురాలి బంధువులు

- ప్రభుత్వ ఆస్పత్రి మార్చురి వద్ద ఉద్రిక్తత

ఖమ్మం, జూన్ 30 (విజయ క్రాంతి): ఖమ్మం రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్త్స్ర రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మ హత్య చేసుకొన్నారని తెలుస్తుంది.తమ కూతురిని ఎస్త్స్రతో సహా ఆయన తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి, ఆమె మృతికి కారణమైనా రని మృతురాలి తల్లి తండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సోమవారం ప్రభుత్వ అస్పత్రి మార్చురీ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఖమ్మం జిల్లాకి చెందిన రాణా ప్రతాప్ ది ఉద్యోగం వచ్చినప్పటినుండి దురుసుగా వ్యవహరించి పలు మార్లు శాఖ పరమైన చర్యలు ఎదుర్కొన్నారు.

గత ఆరు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలో సస్పెండ్ అయి ఈమధ్య లూప్ లైన్ లో ఖమ్మం రైల్వే స్టేషన్ కు ఎస్ ఐ గా వచ్చాడు.వృత్తి పరంగా కూడా వివాదస్పదుడిగా అతనికి పేరుంది!గతంలో ఖమ్మం లో ట్రైని ఎస్త్స్రగా పనిచేస్తున్న సమయంలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక వ్యాపారిని ఆయనతో పాటు ఆయన సోదరుడు అయిన మరో పోలీస్ ఎస్. ఐ ఆ వ్యక్తిపై గన్ను పెట్టి బెదిరించి , దాడి చేసినట్లు రాణా ప్రతాప్ పై ఆరోపణలున్నాయి..! మహబూబాబాద్ జిల్లా సీరోల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తు నడి రోడ్డుపైన ఒక రైతు మీద దాడి చేసాడని తెలిసింది.

కొంత కాలం తరువాత కురవి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ గా వచ్చి స్టేషన్ గుండ్రతిమడుగులో ఒక ఇంజనీరింగ్ స్టూడె్ంపన దాడి చేసాడు. రజాలిపేటలో ఒక దళితుడు హత్యను తారుమారు చేసి సహజ మరణంగా చిత్రికరించే పని చేయగా, ఒక జర్నలిస్ట్ అట్టి హత్య ఉదాంతం బైట పెట్టారని తెలుస్తుంది. పెద్ద గూడూర్ మండల కేంద్రంలో ఎస్. ఐ గా పని చేస్తూ ఒక ప్రమాద వాహనాన్ని తారుమారు చేసిన ఆరోపణలపైన ఇన్సూరెన్స్ అధికారులు ఇచ్చిన పిర్యాదు మేరకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రాంనాథ్ ఆర్ కేకన్ విచారణ జరిపి ఉన్నాతాధికారులకు నివేదిక పంపించిగా రాణా ప్రతాప్ ను ఇటీవల సస్పెండ్ చేసారు.

అల్లారుముద్దుగా పెంచుకున్నాము: రాజేశ్వరి తల్లి దండ్రులు

అల్లారుముద్దుగా పెంచుకొన్న తమ కూతుర్ని ఈ మూర్కుడికి ఇచ్చి పెళ్లిచేశామని రాజేశ్వరి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.తమ కూతురి మరణానికి కారణమైన రానా ప్రతాప్ ను, వారి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని రాజేశ్వరి తల్లి దండ్రులు, బంధువులు కోరుతున్నారు.