calender_icon.png 5 May, 2025 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నీట్’గా.. ప్రశాంతంగా

05-05-2025 02:55:55 AM

  1. జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ 

జిల్లాలోని పరీక్షా కేంద్రాల పరిశీలన

జగిత్యాల, మే 4 (విజయక్రాంతి): జిల్లా పరిధిలో ఆదివారం ’నీట్’ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్  పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. జిల్లాలో మొత్తం 7 వందల 58 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని తెలిపారు. మొదటి సెంటర్లో 4 వందల 80 మంది, రెండవ సెంటర్లో 2 వందల 78 మంది పరీక్ష రాశారని వివరించారు. మొదటి సెంటర్లో 13 మంది, రెండవ కేంద్రంలో 5గురు విద్యార్థులు, మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు.

విద్యార్థులు మొత్తం 740 మంది పరీక్ష రాశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నీట్ పరీక్ష లు ప్రశాంతత వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.  విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టామని  కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రభాకర్, కొడిమ్యాల తహసిల్దార్ రమేష్ పలువురు సీఐలు, ఎస్త్స్రలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్

కరీంనగర్,  (విజయ క్రాంతి): జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 2975 మంది విద్యార్థులకుగాను 2914 మంది పరీక్ష రాశారు. 61 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. కరీంనగర్ బై పాస్రోడ్లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీ, ఎస్సారార్ కాలేజీ నీటక్ష పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, వసతుల కల్పనను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఆమె వెంట నెహ్రు యువ కేంద్ర కో-ఆర్డినేటర్ రాంబాబు, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, తహసిల్దార్ రాజేష్. తదిరులు ఉన్నారు. అఅలాగే వివిధ నీట్ పరీక్షా కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.