28 August, 2026 | 2:02 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

మీసాల వీరుని పులివేట

20-06-2026 12:00 AM

నిజామాబాద్‌లో విగ్రహాన్ని కనుగొన్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): కొత్త తెలంగాణ చరిత్రబృం దం చరిత్ర యాత్రలో సందర్శించిన దేవాలయాలలో అపురూపమైన దేవాలయవాస్తు నిర్మితి నీలకంఠేశ్వరాల యం. అక్కడున్న విడిశిల్పాలు పలుశైలులలో చెక్కిన విగ్రహాలు. అన్నీ చారి త్రకమైనవే. జిల్లా కేంద్రం నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరుని ఆల య ప్రాంగణంలో వీరగల్లులున్నాయి. ఒక వీరగల్లులో వీరుడు కత్తి, డాలు ధరించి వున్నాడు. కుడివైపుకు తిరిగిన సిగ వుంది.

మరొక వీరగల్లు అపురూపమైంది. ఇందులో వీరుడు పులితో పోరుతున్నాడు. రెండో వీరగల్లు సగం నేలలో మునిగివుంది. పైఅంతస్తులో అప్పరసలు, దేవలోకం చేరిన వీరుడు, కింది అంతస్తులో జోడించిన రెండుచేతులలో లింగమా? వుంది. ఇది కూడా ఆత్మా హుతి వీరగల్లే. మరొక వీరగల్లు అపురూపమైంది. ఇందులో వీరుడు పులితో పోరుతు న్నాడు. ఈ వీరగల్లును కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ ఇటీవల దర్శించాడు. పులిని వేటాడుతూ మరణించిన వీరుని యాదిలో వేసిన వీరగల్లు పులివేట వీరగల్లు అంటారు. కన్న డంలో హులిబేటే అంటారు. వీరులు ఏయే కౄరమృగాలతో పోరి మరణించారో వాటిపేరు కలిపి వీరగల్లులంటారు.

ఈ వీరగల్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయం కొలను ఒడ్డున నిలిపివుంది. ఈ పులివేట వీరగల్లుకు శాసనం లేదు. కాని, ఈ వీరుడు ధరించిన ఆహార్యాన్నిబట్టి ఎర్లీ కళ్యా ణీ చాళుక్యకాలానిదని చెప్పవచ్చు. వీరుడు కుడివైపు సిగ, చెవులకు కుండలాలు, హార, గ్రైవేయకాలు, దండకడియాలు, వీరకాసె, ఎడమకాలికి అందె, కుడిచేత బాకు, ఎడమచేత విల్లు పట్టుకున్న మీసాలవీరుడు ఒక ఎక్కటి. పులి వీరుని ఎడమపిడికిలి నోటితో కరిచిపట్టుకున్నది. వెనకకాళ్ళ మీద నిలబడి దాడిచేస్తున్నది.