calender_icon.png 2 August, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

72 గంటల దీక్షను విజయవంతం చేయండి

02-08-2025 02:01:39 AM

యూటీఎఫ్ జాగృతి నేతలు 

నిజామాబాద్ ఆగస్టు 1:(విజయక్రాంతి): బీసీ బిల్లు సాధనకై జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించ తలపెట్టిన 72 గంటల దీక్షను విజయవంతం చేయాలని యు టి ఎఫ్ జాగృతి నిజామాబాద్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో  విలేకరుల సమావేశం నిర్వహించారు.ముందుగా ఇట్టి దీక్షకు సంబందించిన పోస్టర్ లను ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ..ఈనెల 4, 5, 6, 7 తేదీ లలో హైదరాబాద్ లో  ఇందిరా పార్కు వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని దీక్ష తలపెట్టారని,ఇట్టి దీక్షను విజయవంతం చేయలని, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు ,జాగృతి అధ్యక్షులు సాల్వా చారి,అవంతి కుమార్, డాక్టర్.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీల బోనమెత్తుకున్న బహుజన బతుకమ్మ కవితమ్మ అని, సామాజిక ఉద్యమాల్లో సామాజిక అంశాల పట్ల తెలంగాణ జాగృతి ఆవిర్భావం నాటి నుండే కవిత అగ్ర భాగాన  నిలబడ్డారన్నారు. 

తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కవిత అన్ని జిల్లాల్లో బీసీ కులాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక ధర్నాలు,బిసి మేధావులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిటీకి సమగ్ర నివేదికను సైతం అందజేయడం వల్లనే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై చలనం వచ్చిందన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు దర్శనం దేవేందర్, తెలంగాణ శంకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి భరద్వాజ్, నాయకులు పంచ రెడ్డి మురళి, హరీష్ యాదవ్, ఆకాష్, శోభ, సరిత, రేఖ, రాణి,సంతోష్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అజయ్, నాయకులు చంద్రకాంత్, మీసాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.