calender_icon.png 2 August, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయసు పైబడిన వారందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలి

02-08-2025 01:59:47 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ 

కామారెడ్డి, ఆగస్టు 1 (విజయ క్రాంతి): 40 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ  క్రమం తప్పకుండా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా ప్రజలకు సూచించారు.  శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. ముందుగా సదరం బిల్డింగ్‌ను సంద ర్శించి  ఈ బిల్డింగ్  రిపేరింగ్ పనులు పరిశీలింశారు. 

సదరం వైద్య పరీక్షలకు అవసరమైన  వైద్య పరికరాలు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్ తదితర సామాగ్రి అన్ని సమకూర్చుకోవాలని ఆస్పత్రి  సూపరింటిండెంట్ పెరుగు వెంకటేశ్వర్లుకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి  ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని  స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు  ప్రత్యేక  ఆరోగ్య శిబిరంను నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టారు. 

శిబిరంలో 86 మంది మహిళలకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.    40 సంవత్సరాలు పైబడిన వారు అందరూ తప్పనిసరిగా సాధారణ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని  అన్నారు. శిబిరంలో  జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్ ( శస్త్ర చికిత్సా నిపుణులు), ఆర్థోపెడిక్ (ఎముకల వైద్య నిపుణులు), ఆప్తాల్మిక్ ( కంటి వైద్య నిపుణులు),ఈ.ఎన్. టి.(చెవి,ముక్కు గొంతు వైద్య నిపుణులు) గైనిక్ విభాగము ( స్త్రీ వైద్య నిపుణులు ) తదితర విభాగాల వైద్య నిపుణులు ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొని  వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.

అవసరమైన వారికి చికిత్సలు అందించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందర్ నాయక్,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి , ఆర్ .ఎం. ఓ. లు సంతోష్, యాదగిరి గౌడ్ ,  వైద్యులు , నర్సింగ్  సూపరింటెండెంట్ , నర్సింగ్ సిబ్బంది , ఇతర  సిబ్బంది పాల్గోన్నారు.