27న బీరప్ప జాతరకు రండి
23-04-2026 02:02 AM
మంత్రులను ఆహ్వానించిన ఆదిభట్ల కురుమ సంఘం కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నెల 27వ తేదీన అంగరంగ వైభవంగా 11 సంవత్సరాల తర్వాత బీరప్ప జాతరను నిర్వహి స్తున్నారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా మంత్రులను, ఎమ్మెల్యేలను మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదిభట్ల కురుమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు జమ్మ శ్రీశైలం, కుల పెద్దలు యాదగిరి, నర్సింహా, రాజు, యాదయ్య, రఘు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






