20 August, 2026 | 4:02 AM

వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిలపై దాడులు

20-08-2026 12:00 AM

కూకట్‌పల్లి, ఆగస్టు 19,( విజయ క్రాంతి): ఓయో లాడ్జి లలో వ్యభిచారం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం తో రెండు వేరు వేరు లాడ్జి లలో కూకట్ పల్లి పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో  బుధవారం పోలీసులు ఏర్పాటు మీడియా సమావేశంలో బాలనగర్ ఏసిపి నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కెపిహెచ్బి మెట్రో స్టేషన్ కు సమీపంలో జరుగుతున్న వ్యభిచారాన్ని అరికట్టడంలో భాగంగా సమీపంలోని లాడ్జిలపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించామని తెలిపారు.

అల్లూరి ట్రేడ్ సెంటర్ లోని మూడవ అంతస్తులో గల వైశాయి కాటేజ్, నాలుగవ అంతస్తులోని సాయి పేరడైజ్ లో వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం తో దాడులు చేసినట్లు తెలిపారు. దాడులలో భాగంగా లాడ్జిలలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఐదుగురు నిర్వాహకులను, నలుగురు విటులను, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిర్వాహకులలో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అల్లూరి ట్రేడ్ సెంటర్ లోని లాడ్జిల నిర్వాహకులు వ్యభిచార కార్యక్రమల కోసమే ఈ లాడ్జిలను లీజ్ కు తీసుకున్నట్లుతెలుస్తుందన్నారు. ఇట్టి లాడ్జిల నిర్వహణ కోసం అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా కెపిహెచ్బి మెట్రో స్టేషన్ కి సమీపంలో వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది, వాటిని నిరోధించడంలో భాగంగా అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చుట్టుపక్కల ప్రాంతాలలో ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినయెడల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో కూకట్పల్లి ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్, ఎస్త్స్రలు చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, స్రవంతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.