మాజీద్‌పూర్‌లోని ఎంసీఆర్ బేకరీపై దాడులు
- కల్తీ ఉత్పత్తులతో బేకరీ ఐటమ్స్ తయారు చేస్తున్న మేనేజ్‌మెంట్
- పోలీసుల అదుపులో ఎంసీఆర్ బేకరీ యజమాన్యం
శామీర్ పేట్, 29 జూన్ (విజయక్రాంతి) : ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ బేకరీ ఉత్పత్తులు, అపరిశుభ్రంగా తయారు చేస్తున్న కేంద్రం పై ఎస్‌ఓటి అధికారులు దాడి చేశారు. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్ పూర్ లో అక్రమంగా ఎం సి ఆర్ బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రం పై ఎస్‌ఓటి కుద్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది.
ఫుడ్ లైసెన్స్ లు (fssai ) లేకుండానే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లతో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. తయారీ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎం సి ఆర్ బేకరీ యజమాని బోడ ఆనంద్(38) భార్య బోడ సౌజన్య (32) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరు మజీద్ పూర్ క్రాస్ రోడ్ బావర్చి పక్కన ఎం సి ఆర్ బేకరీ పేరుతో తయారు కేంద్ర నడుపుతున్నారు . బేకరీ నిర్వహణ కోసం ప్రభుత్వ అనుమతులు లేవని పోలీసులకు సమాచారం అందింది పక్క సమాచారంతో ఎం సి ఆర్ బేకరీ పై పోలీసులు దాడిలు చేశారు.
వారి వద్ద నుంచి 13 కృత్రిమ రంగుల సీసాలు, ఒక లీటర్ గడువు ముగిసిన బటర్ స్కాచ్ ఫ్లేవర్, 500 మిల్లీ లీటర్ల చొప్పున మూడు గడువు ముగిసిన ఫ్లేవర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు కొనసాగిస్తున్నారు.






