8 June, 2026 | 2:44 AM

అప్పుల బాధతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

08-06-2026 01:28 AM

బెట్టింగే కారణమా?

మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి బోయినపల్లి ఆంజనేయులు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.

అప్పుల బాధ భరించలేక తన భర్త ఆత్మహత్య పాల్పడ్డకు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మృతుడు ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటుపడి సుమారుగా రూ.30 లక్షల మేర అప్పుల పాలైన కారణంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.