కేంద్రమంత్రి పదవా..? రాష్ట్ర అధ్యక్ష పదవా..?
- రేస్లోకి ధర్మపురి అరవింద్
- జోడు పదవులపై జోరుగా ప్రచారం
- సోషల్ మీడియాలో అడ్వాన్స్ శుభాకాంక్షల పోస్టుల వైరల్
బోధన్, జున్ 7 (విజయ క్రాంతి): మూడ వ సారి ప్రధానిగా భాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణ పర్యటన విజయవంతం నేపథ్యంలో బిజేపిలో మార్పుల చేర్పుల ఊహ గానాలు జోరందుకున్నాయి. అవి కేంద్రమంత్రి పేద్ద విస్తరణను మొదలు పెట్టి పార్టీ చీఫ్ మార్పుల వరకు సాగడమే అందుకు కారణం. దక్షిణాన ప్రస్తుతం తెలంగాణపై ఫో కస్ చేసిన బిజేపి అధిష్ఠానం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైన పాగా వేసేందుకు కసరతు మొదలేట్టింది. ఇప్పటికే బిజేపికి నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో 2029 శాసన సభ ఎన్నికలే టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొందరికి కేంద్రమంత్రి వర్గ విస్తరణలో అవకాశం ఉంటుం దనీ, రాష్ట్ర అధ్యక్ష పదవి కొత్తవారికి ఇస్తారని ప్రచారం జోరేందుకుంది. తెలంగాణలో ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడి ఉదంతం తో కొత్తవారికి మంత్రి పదవుల పంపిణీ జరుగుతుందని, రాష్ట్ర పార్టీ రథసారధిని యువ నాయకత్వానికి అప్పగిస్తారని టాక్. నడుస్తుంది.
దానితో రాష్ట్రానికి కొత్తగా కేంద్రమంత్రి పదవి ఇచ్చిన లేదా రాష్ట్ర బిజేపి చీఫ్ పదవి ఇచ్చిన దానిలో ముందువరుసలో తాను ఉన్నానని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పకనే చెబుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి అర్వింద్ కేంద్రమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల రెండోసార్ ఎంపీగా గెలిచిన తరువాత జరిగిన బిజేపి అధ్య క్ష పదవి రేసులో నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్ మూలాలతో రాంచందర్ రావు ఆ పదవిని ఎగురేసుకుపోయిన విషయం తెలిసిందే. ఉత్తర తెలంగా ణలో బిజేపికి బిసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ తరువాత బలమైన నాయ కుడిగా అర్వింద్ ముందువరుసలో ఉన్నారు.






