22 April, 2026 | 2:24 AM

ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

22-04-2026 12:42 AM

అలంపూర్, ఏప్రిల్ 21: గద్వాల జిల్లాలోని పలు పలు మండలాల్లోని ఆయా ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. వేసవి నేపథ్యంలో పగలంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే వాతావరణంలో ఆకస్మికంగా చోటు చేసుకున్న మార్పుల వల్ల  వర్షం కురిసి ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.

కాగా రాజోలి మండలంలోని మాన్ దొడ్డి గ్రామంలో రాత్రి వడగండ్లతో కూడిన వాన కురిసింది. అయితే ఈ అకాల వర్షం కారణంగా చేతికి అందిన వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న కేంద్రాల వద్ద ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చిన రైతులు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి  దాన్యం తడవకుండా వాటిపైన టార్పాలిన్ కవర్లు కప్పేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. రాత్రి ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.