22 April, 2026 | 2:25 AM

జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో వాగ్దేవి విజయకేతనం

22-04-2026 12:40 AM

మహబూబ్ నగర్, ఏఫ్రిల్ 21 (విజయక్రాంతి): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి ఐఐటి అకాడమీ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. ఈ ఫలితాలలో విద్యార్థులు జోగు శివ, ముజామిల్ అలీ, స్ఫూర్తి రెడ్డి, కౌశిక్, వర్ష, అక్షయ కీర్తి, శైలజ, వెంకటేష్ అత్యుత్తమ పర్సంటైల్ సాధించి అడ్వాన్స్ కు ఎంపికైన విద్యార్థులను కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా విజేత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్ తో సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభ కనబరిచి అద్వితీయ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కష్టపడుతూ జేఈఈ అడ్వాన్స్ లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి నీట్ అకాడమీ ఇన్చార్జ్ పావని రెడ్డి, యాజమాన్య సభ్యులు రాఘవేంద్రరావు శివ కుమార్, నాగేందర్, మేగ్య నాయక్, సతీష్ రెడ్డి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.