calender_icon.png 6 September, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు రోజుల పాటు వర్షాలు

06-09-2025 12:32:55 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి మరో ఐదు   రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతోపాటు అక్కడక్కడ బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. శనివారం  ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.