06-09-2025 12:31:57 AM
కరీంనగర్, సెప్టెంబరు 5 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ కోడూరి శ్రీవాణికి రాష్ట్ర ఉత్తమ ఆచార్యురాలిగా అవార్డు లభించింది. ఉపాధ్యా య దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాదులోని శిల్పకళా వేదిక శిల్పారామంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాన, శాసనమండలి సభ్యులు పి. శ్రీపాల్ రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అనుకున్నారు.
ఈ సందర్భంగా ఆమెను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, రిజిస్టార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్, వి సి ఓ ఎస్ డి డాక్టర్.డి. హరికాంత్, సోషల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ఆచార్యులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులుఅభినందించారు.