10 April, 2026 | 3:57 PM

Breaking News

అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •  

సంక్రాంతి తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కాయం

12-01-2026 03:19 PM

- కాంగ్రెస్ అంటేనే...... పేదల పార్టీ

- కరోనా కష్టకాలాల్లో కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఘనత రాజగోపాల్ రెడ్డిదే

- గత ప్రభుత్వంలో మంజూరైన చెక్కులు లబ్ధిదారులకు వెంటనే అందేవి కావు

- ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ అనంతరం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయమని,కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ,కరోనా కష్టకాలాల్లో కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఘనత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 90 మంది లబ్ధిదారులకు రూ.2,45,2000 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

ఓ వైపు అభివృద్ధి మరో వైపు తమ మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత ఖర్చు తో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి  అహర్నిశలు శ్రమిస్తున్న  ఎమ్మెల్యేకు త్వరలోనే మంత్రి పదవి రాబోతుందని  నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక స్టాఫ్ ని నియమించి సేవలందిస్తున్నారని,

కరోనా కష్ట సమయంలో 7 కోట్ల రూపాయల నిత్యావసర సరుకుల పంపిణి చేసి నిరుపేదల ఆకలి తీర్చిన ఘనత రాజ్ గోపాల్ రెడ్డి అని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టు ఉన్న వారికి సీఎంఆర్ ఎఫ్ పై అవగాహన కల్పించాలని కోరారు. చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్  దోటి నారాయణ, జాల వెంకటేశ్వర్లు, బూడిద లింగయ్య, పాలకూరి యాదయ్య, నకిరేకంటి యాదయ్య, వ్యతిరే విజయేందర్ రెడ్డి, నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచులు, మండల ముఖ్య నాయకులు, ఉన్నారు.