12-01-2026 03:14:52 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి దాత దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఆయన 163వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని. ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల యువత దేశానికి అవసరమని ఆయన అన్నారు. ఈ దేశ యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ కార్యదర్శి ఉమేష్ చిరంజీవి బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మహేష్ సిద్ది బాలరాజు రామకృష్ణ బిజెపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి శ్రీకాంత్ కొండని గంగారం శంకర్ భూమేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.