12-01-2026 03:24:41 PM
డెమోక్రసీలోనైనా.. నాన్ డెమోక్రసీలోనైనా..
- ఇదీ జర్నలిస్టులతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ తీరు..
- ఎమ్మెల్యే క్యాప్ ఆఫీసు ముట్టడి..
- ఎమ్మెల్యేతో వాగ్వాదం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): డెమోక్రసీ కావాలా...నాన్ డెమోక్రసీ కావాలా కావాలనా చెప్పండి..ఎట్లైనా సిద్ధమేఅని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో దుమారం లేపాయి. ఎమ్మెల్యే బెదిరింపు ధోరణిపై బెల్లంపల్లి జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు. ఆయనతో మాటకు మాటా బదులు చెప్పినీ తీరు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద జర్నలిస్టుల ధర్నాలో స్వల్ప ఉద్రిక్తతనెలకొంది. ఇటీవల బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై ఎన్ టీవీ ఛానల్ లో వచ్చిన కథనం.. దానిపై కాంగ్రెస్ మాజీ జడ్పీటీసీ కారుకూరి రామచందర్ ఎన్ టీ వి రిపోర్టర్ రమేష్ ను తీవ్రంగా దూషించిన సంఘటనకు నిరసనగా బెల్లంపల్లి జర్నలిస్టులు రామచందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ క్యాంపు కార్యాలయంలో ముందు ఆందోళన చేశారు.
క్యాంపు ఆఫీసుకు చేరుకుని జర్నలిస్టులు ఆందోళనకు పూనుకున్నారు. అప్పటికే క్యాంపు కార్యాలయం వద్ద ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పెద్దఎత్తున జర్నలిస్టులు రామచందర్ పై చర్యలు తీసుకోవాలని చేసిన నినాదాలు హోరెత్తాయి. ఈ క్రమంలో సీఐ శ్రీనివాసరావు ,కొందరు కాంగ్రెస్ లీడర్లు మినిమంద రమేష్, మల్లయ్య, నాతరి స్వామి వచ్చి ముఖ్యులు ఐదుగురు జర్నలిస్టులను ఎమ్మెల్యే సార్ లోనికి రమ్మంటున్నారనీ చెప్పారు.
అందుకు జర్నలిస్టులు ఒప్పుకోలేదు.పైగా తమ దగ్గరకే ఎమ్మెల్యే రావాలని పట్టుబట్టారు. దీంతో దిగివచ్చిన ఎమ్మెల్యే జర్నలిస్టుల వద్దకు వచ్చిన ఆయనా విషయం తెలుసుకోకుండా ఏకంగా వాదనలకు దిగారు. పైగా జర్నలిస్టులను బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేసిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. జర్నలిస్టులకి ప్రజాస్వామం కోసం పాఠాలు చూపడం, మీకుస్వేచ్చా ఉన్నట్టే మాకు కూడా స్వేచ్చ ఉంటుందని పరోక్షంగా తమ కార్యకర్త రామచందర్ కు మద్దతుగా మాట్లాడినా తీరు అక్కడ ఉన్న వారిని విస్మయాన్ని కలిగించింది. జర్నలిస్టులు శాంతియుతంగా వచ్చి తమ సమస్యను చెప్పుకోవడానికి వస్తే ఇలా వారి పై విరుచుకపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అంతేకాకుండా జర్నలిస్టులతో వాద ప్రతివాదనలకు దిగడం బాధ్యతయుతమైన స్థానంలో ఎమ్మెల్యేగా ఆయన తీరు విమర్శలకు దారి తీసింది. తమకు వ్యతిరేకంగా వార్త కథనాలు రాస్తే ఇలానే ఉంటుందని అక్కసును రిపోర్టర్ల పై వెల్లదీశారు. రిపోర్టర్లతో పిడివాదానికి ఎమ్మెల్యే దిగడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. చివరకు ఐదుగురు జర్నలిస్టును మాట్లాడుకుందామని క్యాంపస్ కు ఆహ్వానించారు. అయీష్టంగానే జర్నలిస్టుల వినతి పత్రాన్ని స్వీకరించారు. జర్నలిస్టు రమేష్ పై రామచందర్ వ్యాఖ్యలపై విచారణ చేసి ఆలోచిస్తాన్నారు.
దీంతో క్యాంప్ ఆఫీస్ వద్ద జర్నలిస్టులు ఆందోళనను విరమించి ఎమ్మెల్యేతో కలిసి పలువురు జర్నలిస్టులు లోనికి వెళ్లారు. అక్కడ కూడా ఎమ్మెల్యే గడ్డం వినోద్ బయట మాట్లాడిన తీరునే పునరావృతం చేశారు. మరింత రెట్టింపు చేశారు. అసలు విషయాన్ని ప్రధాన చర్చకు రాకుండా జర్నలిస్టులతో వాదనలు చేశారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం వితండవాదానికి దిగారని జర్నలిస్టులు ఆరోపించారు. తాము ఏం చేస్తే మీకేందని ఆయన మాట్లాడిన తీరు ప్రజాప్రతినిధిగా కనిపించలేదని జర్నలిస్టులు వాపోయారు.
రిపోర్టర్ పట్ల అనుచితమైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రామచందర్ ను కాపాడుకునేందుకే ఆయనా ఈ రకంగా అరాచకమైన చర్చపెట్టిన అసలు విషయాన్ని మరుగునపరిచారని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభం అయిన మీడియా పట్ల ఎమ్మెల్యే గడ్డం వినోద్ కనీస గౌరవాన్ని కనబరచుక పోవడం విడ్డూరంగా ఉందని జర్నలిస్టులు వాపోతున్నారు. ప్రజాజీవితంలో ఉన్న లీడర్లు ఇలా జర్నలిస్టులపై శివాలెత్తితే ఎలా అన్న చర్చ ప్రజల్లో జోరుగా జగుతున్నది.
పదవులు, అధికారం ఏదీ శాశ్వతం కాదనే జ్ఞానం నాయకులకు బొత్తిగా లేకుండా పోయింది. ఆదిలేని వారే ఇలా విర్రవీగుతారన్న అభిప్రాయాల్ని కొందరు ప్రజాస్వామిక వాదులు వాపోతున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వ్యవహారం మారని ఆయన పనితీరును మరోసారి జర్నలిస్టుల విషయంలో బయటపడింది.. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజక వర్గంలోని బెల్లంపల్లి,కాసిపేట, తాండూరు, బీమినీ నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లోనీ జరలిస్టులు పాల్గొన్నారు.