27-05-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, మే 26 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ 21వ మహాసభ సోమవారం బాసెట్టి గంగారం భవనలో జరిగింది. పట్టణ సెక్రెట రీ అడేపు రాజమౌళి అధ్యక్షతన ఈ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో సీపీఐ పట్టణ నూతన బాడీని ఎన్నుకొన్నారు. నూతన పట్టణ కార్యదర్శిగా ఆడెపు రాజమౌ ళి మరోసారి ఎన్నుకున్నారు.
సహాయ కార్యదర్శిగా బొల్లం తిలక్ అంబేద్కర్, కోశాధికా రిగా మంతెన రమేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, సభ్యురాలు బొల్లంపూర్ణిమ, సీనియర్ నాయకులు చిప్ప నరస య్య నూతన బాడీని ప్రకటించారు.