calender_icon.png 8 July, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

26-05-2025 11:11:33 PM

నలుగురు అరెస్టు, ఒకరు పరారు..

రూ .3050, 02 సెల్ ఫోన్లు స్వాదీనం..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ రడగాంబాల బస్తీలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బెల్లంపల్లి 2-టౌన్ ఎస్సై మహేందర్(SI Mahender) తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యేక సమాచారం మేరకు పేకాట స్థావరంపై సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న మొత్తం ఐదుగురు వ్యక్తులలో నలుగురు అరెస్టు కాగా ఒకరు పరారయ్యారు. పట్టుకున్న నలుగురు వ్యక్తుల నుండి రూ.3050, 02 మొబైల్ ఫోన్స్ లభించగా వాటిని సీజ్ చేసినట్లు బెల్లంపల్లి 2-టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు.

పట్టుబడిన వారిలో అంబేద్కర్ రడగంబాల బస్తీకి చెందిన హుజూర్ పృథ్వీరాజ్, ఆసంపల్లి మహేష్, రడగంబల బస్తీకి చెందిన జాడి అశోక్, మంచిర్యాల రాంనగర్ కు చెందిన దుర్గ మహేష్ ఉండగా శాంతిఖనికి చెందిన భూమయ్య తప్పించుకున్నాడని ఎస్ఐ తెలిపారు. ఆపరేషన్ లో బెల్లంపల్లి 2-టౌన్ హెడ్ కాన్స్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ శేఖర్, హోంగార్డు సంపత్ పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.