calender_icon.png 8 July, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షాలతో అన్నదాతల అవస్థలు

27-05-2025 12:00:00 AM

  1. తడిసిన ధాన్యం.. పట్టించుకోని అధికారులు..
  2. వర్షంతో మొలకెత్తిన జొన్నలు...

అదిలాబాద్, బోథ్, మే 26 (విజయక్రాం తి):  ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్న దాతలు అవస్థలు పడుతున్నారు. మార్కెట్ యార్డ్‌కు తీసుకొచ్చిన పంట అకాల వర్షాల కారణంగా తడిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోథ్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

బోథ్ మార్కెట్ యార్డ్‌లో గత రాత్రి కురిసిన వర్షానికి జొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. పంట రక్షణకు ప్లాస్టిక్ పారీలు కప్పినప్పటికీ ధాన్యం తడిసిపోయిందని దానిని ఆరబెట్టడానికి నానా అగచాట్లు పడుతున్నామన్నారు. కొందరు ప్లాస్టిక్ రబ్బర్లతో ధాన్యం నుండి నీటిని వేరు చేస్తున్నారు. ఆరబెట్టడానికి ప్రయత్నించే లోపే మళ్లీ వర్షం వస్తుందని దాంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అధికారుల నిర్లక్ష్యం...

ధాన్యం మార్కెట్ కు తీసుకువచ్చి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న ముందు వచ్చి న రైతుల ధాన్యాన్ని కాదని, వెనుక వచ్చిన, నాయకుల రికమండేషన్‌లతో వచ్చిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని రైతులు దుయ్యబట్టారు. సరైన ప్రణాళిక లేకుండా ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే పంట కొనుగోలులో కొర్రీలు పెడుతున్నారని, పంట మాయిచ్చర్  14 శాతం కంటే ఎక్కువగా ఉంటే కొనుగోలు చేయడం లేదన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృశ్య ఎట్టి పరిస్థితుల్లోనూ 14 శాతం కంటే పైనే మాయిశ్చర్ ఉంటుందని అధికారులకు విషయం తెలిసి కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. ఇకనైనా అధికారులు స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా పూర్తి పంటలను కొనుగోలు చే యాలని డిమాండ్ చేస్తున్నారు. టోకెన్ సిస్టం ఏర్పాటు చేసి ముందుగా వచ్చిన వారి పంటను కొనుగోలు చేయాలని కోరుతూన్నారు.

మొలకెత్తుతున్న జొన్న పంట..

పండించివ జొన్న పంటను అమ్మకానికి మార్కెట్ కు తీసుకు వస్తే అకాల వర్షాల కారణంగా తడిచిన జొన్న పంట మొలకెత్తున్నాయి. తడిసిన జొన్న పంటను పూర్తి స్థాయిలో ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డుల్లో పంట రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రైతుల ఆరోపించారు. 

తేమతో సంబంధం లేకుండా పంటను కొనుగోలు చేయాలి

తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పూర్తి పంట ను కొనుగోలు చేయా లి. అధికారులు నిర్ల క్ష్యం వహించకుండా దాన్యం కొనుగోల్లను వేగవంతం చేయాలి. ధాన్యం రక్షణ బాధ్యత అధికారులే తీసుకోవాలి. ఎన్నో రోజులుగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాధుడే కారువైయ్యారు. 

                                                                                                                                                                                                       బోజారెడ్డి, రైతు, పిప్పల్ ధరి  

అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి...

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృశ్య ధాన్యం తడవకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి... పంట రక్షణ బాధ్యతలు చేపట్టాలి. రికమండేషన్లకు తావు లేకుండా ముందుగా వచ్చినవారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి.

 వినయ్, యువ రైతు, మర్లపల్లి