calender_icon.png 16 October, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి

16-10-2025 02:29:05 AM

ఆలయ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్ 

వేములవాడ, అక్టోబర్ 15 (విజయక్రాంతి):వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివా స్ స్పష్టం చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆల య విస్తరణ అభివృద్ధి పనులతో పాటు ఈ నెల 19, 20న శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి తీర్థ స్వామి. వేములవాడ పర్యటన నేపథ్యంలో బుధవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తో కలి సి వివిధ శాఖల అధికారులతో ఆలయ గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో భాగంగా ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ,భక్తుల దర్శనాలు శృంగేరి పీఠాధిపతి పర్యటన నేపథ్యంలో చే పట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అ నంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రూ.76 కోట్లతో మొదటి దశలో ఆలయ అ భివృద్ధి పనులు, రూ. 35 కోట్లతో నిత్యాన్నదాన సత్రం భవనం నిర్మాణం, రూ. 47 కో ట్లతో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఆలయ అభివృద్ధి నేపథ్యం లో భక్తులకు ఆలయం ముందు భాగంలోని రావి చెట్టు కింద ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. స్వామి రథంతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించి స్వామి ఆశీర్వాదం అందించారని, అట్లాగే ఆలయ ఆవ రణలో రథాన్ని నిలిపి స్వామి వారి దర్శన భాగ్యం ఆశీస్సులు అందిస్తామన్నారు. ఆలయ అభివృద్ధిపై ప్రతి శుక్రవారం అధికారులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు.

రాజన్న ఆలయ అభివృద్ధి ఏ ఒక్కరి ఎజెండా కాదని, ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి, జిల్లా మం త్రులతో పాటు భక్తుల సలహాలు సూచనలు ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి పను లు కొనసాగుతాయన్నారు. శృంగేరి పీఠాధిపతి పర్యటన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. అభివృద్ధి పనుల్లో భాగంగా భక్తుల సేఫ్టీ ని దృష్టిలో ఉంచుకొని దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ. వేములవాడ రా జరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా భక్తుల దర్శనాలు కోడె మొ క్కులు ఇతర పూజలు కల్పించే విషయమై చర్చించినట్లు తెలిపారు. మరో రెండు వారా ల్లో కళ్యాణకట్ట ఇతర కట్టడాలు కూల్చివేతలు పూర్తవుతాయనీ, ఒకవైపు కూల్చివేతలు మ రోవైపు మహా మండపం నిర్మాణం పూర్తి కా వాల్సి ఉందన్నారు.

ఆలయ తూర్పు భాగం లో ఎల్‌ఈడి స్క్రీన్ పై స్వామివారి, అమ్మవా రీ, గణపతి దర్శనం కల్పిస్తామన్నారు. ఆలయంలో స్వామివారి ఏకాంత సేవల్లో మొక్కుబడి కోసం టికెట్లు తీసుకున్న భక్తుల గోత్రనామాలు చదివి పూజలు చేస్తారన్నారు. ఎల్. ఈ.డి స్క్రీన్ లపై స్వామివారిని దర్శించుకుని మొక్కులు, చెల్లించుకోవచ్చన్నారు. భీమేశ్వరాలయంలో సైతం ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో వీటిఏడిఎ వైస్ చైర్మన్, జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ మహేష్ బి.గీతే, ఆలయ ఈ.వో రమాదేవి, ఆర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.