calender_icon.png 16 October, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన తప్పనిసరి

16-10-2025 02:30:13 AM

-వ్యాధితో పెరుగుతున్న మరణాలు

-ప్రతి ఆరు నెలల కోసారి టెస్ట్‌లు చేయించుకోవాలి

- డాక్టర్ రమ్య, సీ. వలివేరు

హైదరాబాద్, అక్టోబర్ 15(విజయక్రాంతి): భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అక్టోబర్‌ను ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తిస్తారు.. ఈ నెలలో రొమ్ము క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడం అంతే ముఖ్యమని  హైదరాబాద్‌లోని కొం డాపూర్‌కు చెందిన కిమ్స్ హాస్పిటల్స్ ఎండోక్రైన్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్, కన్స ల్టెంట్ బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమ్య సి.వలివేరు పేర్కొన్నారు.

ఈ మహామ్మారి నుంచి బయటపడ్డ వారిని గౌరవించడం, ఆశ మరియు ధైర్యం అనే సందేశాన్ని ఇవ్వాలన్నారు. రొమ్ము క్యాన్సర్ విషయంలో అవగాహన అంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమా జాన్ని, చట్టాలను తయారు చేసే వారిని చైతన్యపరచి చర్యలు తీసుకునేలా చేయాల న్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మహిళల్లో ఈ వ్యాధి గుర్తించబడుతుంది మరియు  లక్షకు పైగా మహిళలు దీని కారణంగా ప్రాణా లు కోల్పోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో 1.38 మిలియన్ల మంది ఈ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్నారు.

ప్రతి 24 మందిలో ఒకరికి ఈ క్యాన్సర్ వస్తుందన్నారు. ప్రత్యేకంగా గ్రామీ ణ భారత దేశంలో, రొమ్ము క్యాన్సర్ ఇంకా రహస్య సమస్యగా మిగిలి ఉందని, అవగాహన అనేది చాలా ముఖ్యం. ముం దుగా గుర్తించి చికిత్స చేయ డం వలన ప్రాణాలను  కాపాడవచ్చునని డాక్టర్ రమ్య పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు.. రొమ్ము లోపల ఒక గట్టి ముద్ద లేదా గడ్డ ఏర్పడటం,రొమ్ము ఆకారం, పరిమాణం లేదా రూపంలో మార్పు, రొమ్ము చర్మంపై డింప్లింగ్ లేదా పిట్టింగ్ (నారింజ తొక్క లాగా కనిపించడం),చనుమొన లోపలికి వెళ్లడం లేదా చనుమొన రూపాన్ని మార్చ డం, చనుమొన నుంచి ద్రవం కారడం, రొమ్ము లేదా చంకలో నొప్పి తగ్గకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయ న్నారు.

ప్రతి సంవత్సరం ఒకసారి మామోగ్రాఫీ, ప్రతి ఆరు మాసాలకు ఒకసారి బ్రెస్ట్ స్పెషాలిస్ట్ చేత క్లినికల్ పరీక్షలు, నెలకు ఒకసారి రొమ్ము స్వీయ పరీక్ష చేసుకోవం చాలా ముఖ్యం. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు లేనప్పుడు కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యమన్నారు. వ్యాధి ప్రారంభ దశలలో, రొమ్ము కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేస్తారు. రేడియేషన్ థెరపీ: ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి అధిక-శక్తి కిరణాలను ఉపయోగిస్తుంది.

సిస్టమిక్ థెరపీ: కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, హార్మో న్ థెరపీ, టా  శరీరంలోని ఇతర భాగాలకు వ్యా పించిన క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి మందులను ఉపయోగిస్తారు. రొమ్ము క్యాన్సర్ మహిళల్లో మాత్రమే కాకుండా, పురుషులకు కూడా వచ్చే అవకాశం ఉంది. అవగాహన మరియు పరిశోధన పెరగడం వలన మనుగడ రేట్లు పెరుగుతున్నాయి మరియు మరణాల సంఖ్య తగ్గుతోంది.