20 June, 2026 | 4:09 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

మత సామరస్యానికి ప్రతీక రాజేంద్రనగర్

30-03-2026 12:00 AM

మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా న్యాజ్

మణికొండ, మార్చి 29 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం మత సామరస్యానికి నిలయమని, అన్ని వర్గాల ప్రజ లను కలుపుకుని వెళ్లడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి అమ్మ గార్డెన్లో నిర్వహించిన న్యాజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలా ది మంది ప్రజలకు స్వయంగా అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణు గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏర్పుల కుమార్, లక్ష్మి శ్రీ, నాయకులు బషీర్, శ్రావ ణ్ కుమార్, పుల్లారావు, సంతోష్ తదితరు లు హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో అమ్మ గార్డెన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.