05-08-2025 10:37:03 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఎస్సైగా రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఏజెన్సీ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ ఎస్ ఐ కి సూచించారు.