05-08-2025 10:35:02 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): బహిరంగ మలమూత్ర విసర్జన చేయొద్దని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. స్తానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు గల సులబ్ కాంప్లెక్స్ వద్ద పబ్లిక్ టాయిలెట్ వినియోగంపైన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ... పట్టణ ప్రజలందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు లేదా ప్రజా మరుగుదొడ్లు మాత్రమే వాడాలని ఎవరు కూడా బహిరంగంగా మల,మూత్ర విసర్జన చేయరాదని కోరారు. బహిరంగ మల మూత్ర విసర్జన ద్వారా ఈ వర్షాకాలంలో అనేక అంటూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కావున ప్రజలందరూ మరుగుదొడ్లే వాడాలని సూచించడం జరిగింది.