calender_icon.png 6 August, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా త్వరితగతిన రీ సర్వే నిర్వహించాలి

05-08-2025 10:41:55 PM

రీ సర్వేకు రైతులు సహకరించాలి

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

నూగూరు,(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలం రెవిన్యూ గ్రామం నూగురు(జి)పైలట్ ప్రాజెక్ట్ (రీ-సర్వే) కింద భూ సరిహద్దుల సమగ్ర సర్వేపై నిర్వహిస్తున్న సర్వేను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సర్వేలో ఎటువంటి పొరపాటు జరగకుండా, నిష్పక్ష పాతంగా పారదర్శకంగా త్వరితగతిన రీ సర్వే నిర్వహించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రీ సర్వేపై జరుగుతున్న సరిహద్దులు గుర్తింపు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయార్ రాజ నరసయ్య సర్వేయర్ వీరస్వామి కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూగురు(జి) గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద (రీ-సర్వే)కు సంబంధించి తీసుకున్నామని తెలిపారు. సర్వే ఏజెన్సీ పహానీలో వివరాలు, పట్టదారుల వివరాలు ఎంజాయ్ మెంట్ సర్వే చేసి ఫీల్డ్ రిజిస్టర్,నక్షా రూపొందించినున్నారని తెలిపారు. సర్వేలో ఎటువంటి పొరపాటు జరగకుండా, రీ సర్వే నిర్వహించాలని నిష్పక్ష పతంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  రైతులు రీ సర్వేకు సహకరించాలని కలెక్టర్ కోరారు.