calender_icon.png 9 August, 2025 | 5:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరిగొప్పుల పోలీసు స్టేషన్ లో రాఖీ సంబరాలు

09-08-2025 01:06:33 PM

తరిగొప్పుల: అన్న, చెల్లెలా అనురాగం, అక్కా, తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగని ఎస్సై గుగులోత్ శ్రీదేవి  అన్నారు. శనివారం తరిగొప్పుల పోలీస్ స్టేషన్ లో(Tarigoppula Police Station) రాఖీ పండగ సంబరాలు నిర్వహించారు. ఎస్ఐ శ్రీదేవి మండలంలోని ప్రింట్ మీడియా జర్నలిస్టులకు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సోదర, సోదరీమణుల మధ్య సంబంధాలను బలపరిచే విధంగా సుఖసంతోషాలతో రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని, రాఖీ  పండుగ జర్నలిస్టులతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు పోలీసులకు సహకరించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.