నాచారంలో ‘సర్’ అవగాహన ప్రచార వాహనం ప్రారంభం
ఉప్పల్, జూలై 23 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని నాచారం బొడ్రాయి వద్ద గురువారం సర్ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్) అవగాహన ప్రచార వాహనాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వరలక్ష్మి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి.ఎస్. ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. అనంతరం పరమేశ్వర్ రెడ్డి నాచారం, హెచ్‌ఎంటీ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ సర్ క్యాంపులను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు సర్ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరించి, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, అవసరమైన సవరణలు ఉంటే సంబంధిత ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జి. కృష్ణారెడ్డి, హెచ్.ఆర్. మోహన్, రమేష్ గౌడ్, రామ్ రెడ్డి, నాచారం డివిజన్ అధ్యక్షులు నూతంకంటి రాజు, శ్రీకాంత్ గౌడ్, హెచ్‌ఎంటీ డివిజన్ అధ్యక్షులు మహేష్ గౌడ్, అశ్వత్థామ రెడ్డి, ఎం. రాజిరెడ్డి, షరీఫుద్దీన్, నర్సింగ్ రావు, రఘు, అజీమ్, ఫిరోజ్, సంతోష్ రెడ్డి, ఖయ్యాం, షాహిద్, రవి యాదవ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జి. రాకేష్, నిఖిల్ సాయి, శ్రీధర్, బాలరాజ్, మహిళా కాంగ్రెస్ నాయకులు ఉమ, భాతమ్మ, భూలక్ష్మి, భావనా గౌడ్, సుజాత తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






