14-04-2025 01:43:44 AM
ములుగు, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి) : ములుగు జిల్లా ఏటూరునాగారం వైజంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు చేసేది బీజేపీ ఒక్కటేనని గుర్తించాలన్నారు.