20-06-2025 12:07:51 AM
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తుండగా.. వృద్ధి సినిమాస్ బ్యా నర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయి న్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ‘మీర్జాపూర్’ సిరీస్ ఫేమ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ దివ్యేందుశర్మ ‘రామ్ బుజ్జి’ అనే ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు.
గురువారం దివ్యేందుశర్మ బర్త్‌డే. దీంతో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో క్రికెట్ బంతిని ఎగరేస్తూ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన సెట్‌లో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహ్మాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: వినాష్ కొల్లా.