అడ్లూరు వద్ద మట్టిలో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు
08-08-2026 12:15 PM
రామారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి కామారెడ్డి నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అడ్లూరు సమీపంలో రోడ్డు కింద మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో బస్సు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. అయితే బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఇటీవల కురుస్తున్న వర్షాలతో రహదారి పక్కన మట్టి తడిసి బలహీనంగా మారడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు జారినట్లు స్థానికులు తెలిపారు. బస్సు మట్టిలో ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి బస్సును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






