13-02-2025 01:10:50 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రకుమార్ దాస్ మహరాజ్ (83) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈనెల 3న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రాగా లక్నోలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించడంతో మృతిచెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు నుంచి సత్యేంద్రకుమార్ దాస్ రామ మందిరానికి ప్రధాన పూజారిగా ఉన్నారు.