21 March, 2026 | 6:35 PM

జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ

21-03-2026 05:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం రంజాన్ పండుగను మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో ఉదయం 9 గంటలకు వేలాదిమంది మైనార్టీ సోదరులు తరలివచ్చి పవిత్ర ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం అలింగమనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లో విందులు ఏర్పాటు చేసి మిత్రులను ఆహ్వానించారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ పోలీసులు బందోబస్తు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు