21 March, 2026 | 7:11 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

విద్య, నాగరికత, నాగరికతతోనే అభివృద్ధి సాధ్యం

21-03-2026 05:33 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): విద్యతోనే నాగరికత నాగరికతవని అభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో సామాజిక చైతన్యానికి నాంది పలుకుతూ అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహనీయులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించగా.. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న చేతులమీదుగా శనివారం అదే స్థలంలో పునః ప్రతిష్ట చేసి అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే క్రీడోత్సవాలను సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. 

 అనంతరం మహనీయుల విగ్రహాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు చింతకుంట్ల విట్టల్ సభా అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి దళితుల హక్కుల కోసం వారు చేసిన కృషిని కొనియాడారు.మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు.జ్యోతిరావు ఫూలే మహిళా విద్య, కులవ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించగా, బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిగా నిలిచారని పేర్కొన్నారు. పూలే చూపిన విద్యా దీపం… జగ్జీవన్‌రామ్ చూపిన సమానత్వ మార్గం… ఇవే మనకు దిక్సూచులనీ ఎమ్మెల్యే ఘాటైన సందేశం ఇచ్చారు. సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగకూడదని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ అన్నబోయిన శ్రీకాంత్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, అరుంధతి యువజన సంఘం అధ్యక్షులు చింతకుంట్ల పరమేష్,ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, ఏవైసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), విగ్రహ నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మందుల నరేష్, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి, సుంకరి జనార్ధన్,వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు, యువజన లు మహిళలు భారీగా హాజరై మహనీయుల సేవలను స్మరించుకున్నారు.