21 March, 2026 | 6:02 PM

కష్టపడి పని చేసే నేతలకు పదవులు

21-03-2026 04:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి డిసిసిలో అవకాశం లభించిందని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కోశాధికారిగా ఎన్నికైన దశరథ్ అధికార ప్రతినిధిగా ఎన్నికైన ముడుసు సత్యనారాయణను శనివారం సన్మానం చేశారు. మంత్రిని కలిసిన వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎసిఎస్ మాజీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పల మహేష్ రైతు సమన్వయ కమిటీ నిర్మల్ రూలర్ అధ్యక్షులు మల్లేష్ పార్టీ నాయకులు పోశెట్టి అనుముల భాస్కర్ తదితరులు ఉన్నారు.