calender_icon.png 4 December, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాధర్నాకు కదిలిన రామాయంపేట జర్నలిస్టులు

04-12-2025 01:02:05 AM

రామాయంపేట, డిసెంబర్ 3 : జర్నలిస్టుల సమస్యల సాధనకై మెదక్ జిల్లా రా మాయంపేట జర్నలిస్టులు హైదరాబాద్ లో జరిగే మహాధర్నాకు బుధవారం తరలివెళ్లారు. టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యం లో బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు.

వెళ్లిన వారిలో టీ యుడబ్ల్యూజె (ఐజేయూ) రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాగి లింగం, భైరవరెడ్డి, నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అజ్గర్, తుజాల శ్రీనివాస్ గౌడ్, బోయిని రాజు. రాచపల్లి సురేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ని కలిసి రామాయంపేట, నిజాంపేట మండలాల్లో విలేకరుల ఇళ్ల స్థలాలపై చర్చించారు.