04-12-2025 12:59:55 AM
కమాండింగ్ ఆఫీసర్ కర్ణల్ ఎస్ కే సింగ్
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 3 : రక్తదానం చేయడంతో నిజమైన సంతృప్తి లభిస్తుందని తోటి వారి ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. బుధవారం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బెటాలియన్ శిక్షణ శిబిరంలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులగా కమాండింగ్ ఆఫీసర్ కర్ణల్ ఎస్ కే సింగ్ మాట్లాడుతూ శిక్షణతో పాటు సమాజ సేవ పట్ల అవగాహన కలిగి ఉండాలని గుర్తు చేశారు. ఈ క్యాంపులో నేర్చుకున్న విషయాలు జీవితంలో ఎంతో గాను తోడ్పడతాయని గుర్తు చేశారు.
పిల్లలను ఉద్దేశించి చైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ ఎన్సిసి శిక్షణ శిబిరంలో ప్రతి విద్యార్థి సమాజం పట్ల పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు. రక్తదాన శిబిరంలో ప్రతి విద్యార్థి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల విద్యార్థి ఉత్సాహంగా ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, లెఫ్టినెంట్ కర్ణల్ కేకేఎస్ మార్బుల, సుబేదార్ మేజర్ కుల్దేర్ సింగ్, సంజీవ్ కుమార్. యూత్ కోఆర్డినేటర్ రాజేశ్వరి, శిరీష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.