15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాంభూపాల్, రామకృష్ణకు కాంగ్రెస్ భవన్‌లో సన్మానం

26-06-2025 01:11 AM

నిజామాబాద్, జూన్ 25 (విజయ క్రాంతి): బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గా నియమితులైన రాంభూపాల్ కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ ను ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇస్తుంది అనడానికి ఇది నిదర్శనం అన్నారు.

పార్టీ నమ్మకంతో మీకు ఈ పదవులు ఇచ్చింది కావున పార్టీ నమ్మకాన్ని కాపాడుతూ పార్టీనీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే విధంగా పనిచేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా రామ్ భూపాల్,రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాపై నమ్మకం తో ఈ పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,నవాజ్,ప్రీతం,మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,మాజీ కార్పొరేటర్ విజయ,కొండపాక రాజేష్ ,లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు